*NEP 2020 అమలు లో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ జారీ చేసిన సర్కులర్ 172 తేదీ.31.05.21 నందలి కొన్ని ముఖ్యాంశాలు👇*
*✰ వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో మూడు రకాల పాఠశాలలు మాత్రమే ఉంటాయి.*
*➪ 1.Pre Primary (PP1,PP2)*
*➪ 2.Foundation(Preparatory 1,1,2)*
*➪ 3.High Schools(3 to 10/12)*
*✰ ఇకపై ప్రైమరీ స్కూల్స్ లో 2 వ తరగతి వరకు మాత్రమే ఫౌండేషనల్ స్కూల్స్ గా ఉంటాయి.... అంగన్వాడీ లు YSR ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా పనిచేస్తాయి....*
*✰ ఫౌండేషనల్ స్కూల్స్ లో 1,2 తరగతులకు ఒక SGT మాత్రమే ఉంటారు .....*
*✰ ఏ పాఠశాలల నుండి 3 నుండి 5 తరగతులు షిఫ్ట్ అవుతాయో ఆ తరగతులు భోదించే ఉపాధ్యాయులు కూడా హైస్కూల్ కు షిఫ్ట్ అవుతారు.*
*✰ 3 కి.మీ. పరిధి లోని ప్రాధమిక పాఠశాలలలోని 3 నుండి 5 తరగతులు అన్నీ సమీప UP / హైస్కూల్ లో Merge అవుతాయి.*
*✰ 3 నుండి 5 తరగతులు కలవడం వల్ల UP స్కూల్స్ లో రోల్ 150 దాటితే వాటిని హైస్కూల్స్ గా చేస్తారు.*
*✰ Habitation లో 1 కి.మీ పరిధిలో ఫౌండేషనల్ స్కూల్స్ , 3 కి.మీ. పరిధిలో Secondary స్కూల్స్ విద్యార్థులకు అందుబాటులో వుండాలి.*
*✰ ప్రైమరీ స్కూల్స్ లో 1:30 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు... ఆ పై స్థాయిలలో 1:35, 1:40 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు.*