*ప్రభుత్వ/జిల్లా పరిషత్/మునిసిపల్/ఎయిడెడ్ ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి*
1)పొరుగు జిల్లాలలో 9,10 తరగతులకు SA1, SA2 పరీక్షల ప్రశ్నపత్రాలను అందించుటకు విద్యార్థి ఒక్కింటికి Rs.70/- ల నుండి Rs.100/- వరకు పాఠశాలల నుండి వసూలు
చేయుచున్నారు.
2)ప్రధానోపాధ్యాయుల సంఘం ముఖ్యంగా శ్రీ.SJA Steevenson వారి request మేరకు ఒక ప్రధానోపాధ్యాయునిగా నేను మరియు బోర్డ్ మెంబర్లు అలోచించి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కూడా SA1 & SA2 పరీక్షా ప్రశ్నపత్రాలకు ఎటువంటి రుసుము వసూలు చేయకుండా అందించుటకు నిర్ణయించడం జరిగినది.
3)జిల్లా విద్యాశాఖాధికారి గారి నిర్వహణలో జరుగుతున్న నెలవారీ పరీక్షలు ( Maths/P Science/English ) కండక్ట్ చేసి సంభందిత ప్రొఫార్మలో మార్కులు అప్లోడ్ చేయవలెను. ఈ మార్కులపై సంభంధించిన ఉపాధ్యాయులతో సమీక్షలు జరిపి , తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్ ఇవ్వవలసినదిగా ఆదేశించడమైనది.
4) సాధ్యమైనంత త్వరలో 10 వ తరగతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి కోరిక మేరకు Maths, P Science, మరియు English లలో *'Study Material'* ను తయారు చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ DCEB ద్వారా ఉచితముగా ఇవ్వడానికి కృషిచేస్తున్నాము అని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
5) ది.01.08.2019 నుండి TC పుస్తకము ఒక్కింటికి Rs.250/- లుగా ధర నిర్ణయించడ మైనది.Account No: 33989125012,
SBI, Bazar Branch, Machilipatnam, IFSC Code : SBIN0001596 నకు Online/NEFT ద్వారా చెల్లించవలసినదిగా కోరడమైనది. లేదా Secretary, DCEB, Krishna పేరు మీద DD ద్వారా మచిలీపట్నం లో చెల్లెవిధంగా చెల్లించవచ్చును.
6) ది.20.08.2019 లోపు పాఠశాల strength report ను class wise, medium wise మేము పోస్ట్ చేసిన సర్కులర్ లో పూరించి whatsapp / dcebkrishna@gmail.com లో లేదా ప్రొఫార్మ నింపి DCEB కార్యాలయానికి అందజేయవలెను.
సందేహాల నివృత్తి కొరకు T .రమేష్, Subject Expert, DCEB ,Krishna Mobile No: 9290111622 లేదా 7981806014 ల ద్వారా సంప్రదించవచ్చును.
- *P LALITHA MOHAN, Secretary, DCEB, Krishna*
No comments:
Post a Comment